తెలంగాణ లో సీఎం మార్పు పై రోజు రోజు కి చర్చలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి సైతం కేసీఆర్ కేటీఆర్ కి పట్టాభిషేకం చేస్తున్నారని తెలిసిపోయింది.. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాయకత్వ మార్పు అంశంపై మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. కేటీఆర్ ని వీక్ చేసే విధంగా అయన మాట్లాడుతున్నారు. కాబోయే సీఎం అభ్యర్థి కేటీఆర్ కావడంతో ఆయనను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ ఇతర గులాబీ నేతల్లో అసంతృప్తి ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు.