రాష్ట్రంలో అరెస్ట్ ల పర్వానికి ముగింపు పడింది అనుకునే లోపే మరో అరెస్ట్ ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో అలజడి సృష్టిస్తుంది. ఇంట్లో భోజనం చేస్తున్న టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ని వందలమంది పోలీసులు చుట్టుముట్టి పూర్తిగా భోజనం చేయకముందే బలవంతంగా తీసుకెళ్లారు. సౌమ్యుడు, మృదుస్వభావి అయినా ఆయన ని పోలీసులు ఎంత బలవంతంగా తీసుకెళ్లారో ఆ దృశ్యాలే చెప్తున్నాయి. ఈ అరెస్ట్ టోటల్ గా సినీ ఫక్కీ లో జరగగా అచ్చెన్న అరెస్ట్ కూడా ఇదే తరహాలో జరిగింది.. రామతీర్థం ఘటనకు కారణం చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావ్ అని వైసీపీ నేతలు ఫిర్యాదు ఇలా ఇచ్చారో లేదో పోలీసులు తమ విశ్వాసాన్ని కొన్ని క్షణాల్లోనే చూపించారు.