మొదటి నుంచి కోర్టులో వైసీపీ కి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి... ఏ కేసులో అయినా వైసీపీ ప్రభుత్వం ఓడిపోతూ వస్తుంది.. దాంతో న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి నమ్మకం లేదన్న స్థితికి వైసీపీ నేతలు వచ్చేశారు. బహుశా ఇన్నేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇన్ని సార్లు కోర్టులు కేసులు ఓడిపోవడం ఇదే మొదటిసారి కావచ్చు. తాజాగా స్థానిక ఎన్నికల విషయంలో జగనోరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు తీర్పు ఇవ్వగా ఇదివరకే ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలోనూ జగనోరి వర్గానికి షాక్ ఇచ్చే తీర్పునే ఇచ్చింది కోర్టు.. అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఇటీవలే హై కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే..