శృంగార తార గా ఓ తరం ఆడియెన్స్ ని అలరించింది నటి షకీలా.. స్టార్ హీరో హీరోయిన్ లకు సైతం ఏమాత్రం తీసిపోకుండా రెండు దశాబ్దాలపాటు ఆమె తన హవాని చూపించారు. బీ గ్రేడ్ సినిమాలు నటించిన ఆమెకు హీరోయిన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉడేది. రోజు ల చొప్పున కాకుండా గంటల చొప్పున ఆమె పారితోషకం తీసుకుని కొత్త రకం పద్ధతిని ప్రవేశ పెట్టారు. తక్కువ సమయంలోనే పేరులో కానీ, ఆస్తుల విషయంలో కానీ ఎంతో ఎత్తుకు చేరుకున్నారు. అయితే దాన్ని నిలబెట్టుకోలేక ఒక్కసారిగా కిందపడిపోయారు..