రెండు నెలలుగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, ఉద్రేకాలకు లోను కాకుండా రైతన్నలు కొనసాగిస్తున్న నిరసన చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. జాతి పిత మహాత్మా గాంధీ చూపిన బాటలో నడుస్తూ స్వాతంత్ర పోరాటాన్ని అన్నదాతలు తలపిస్తున్నారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున లక్ష ట్రాక్టర్లతో చేయ తలపెట్టిన ర్యాలీపై సుప్రిం కోర్టు కూడా జోక్యం చేసుకోకపోవడం రైతులు చేస్తున్న ఉద్యమం ఎంత శాంతియుతంగా సాగుతుందో తెలియజేస్తోంది. ర్యాలీకి అనుమతి విషయం పోలీసుల పరిధిలోనే ఉందని సుప్రిం చెప్పగా.. పోలీసులు ర్యాలీకి అనుమతించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.