ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ జనసేన పార్టీ ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ తో పొత్తు తమకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది బీజేపీ కి ప్లస్ పాయింట్ గా మారిపోయి జనసేన కు మైనస్ గా అయిపోతుంది.. దాంతో జనసేన ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. చంద్రబాబు కు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో అధికార పార్టీ వైసీపీ కి బీజేపీ ఏమాత్రం మించిపోలేదు.. జగన్ ను సైతం భయపెట్టే వ్యూహాలతో ముందుకు వెళ్తుంది బీజేపీ..ఇలాంటి సమయంలో బీజేపీ మాట వినడం తప్పా జనసేన ఏం చేయాలో అర్థం కావట్లేదు.