ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. అన్ని పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నికను తీసుకుని ప్రచారం కోసం అన్ని సిద్ధం చేస్తున్నాయి..ఏ పార్టీ కి ఏ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది.. 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇక్కడ హాట్ ఫెవరెట్ గా దిగుతుండగా అండర్ డాగ్స్ గా బీజేపీ, జనసేనలు దిగబోతున్నాయి.. ఇక టీడీపీ కూడా గెలుపు ధీమాతో ఇక్కడ రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ఇక్కడ పోటీ చేసే టీడీపీ అభ్యర్థి ని ప్రకటించింది.. గత ఎన్నికల్లో ఓడిపోయినా పనబాక లక్ష్మిని మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తుంది.