దేశ ప్రయోజనాలను కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను కూడా బీజేపీ కాంగ్రెస్ కు దూరం చేస్తుంది. వచ్చే ఎన్నికలకు సమాయత్తమవ్వడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీకే శక్తి సరిపోదన్నది వాస్తవం. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఆధిక్యతను కనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఏ అనేది వచ్చే ఎన్నికల్లో ఉంటుందా? లేదా? అన్నది పార్టీలోనే చర్చగా మారింది. ఇంతకు ముందు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు చూసేవి. ఇప్పుడు అదే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ఎదురు చూపులు చూస్తుంది.