ఢిల్లీ సాక్షిగా రైతులు వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలనీ కోరుతూ ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.. మూడు నెలలుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని కొంచెం కూడా పట్టించుకోక పోగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెలరేగిన అల్లర్ల సంగతి తెలిసిందే..రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టి.. తమ రైతు జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో రైతులను అదుపుచేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ అల్లర్ల నేపథ్యంలో ఇటు రైతులపై కూడా పెద్ద ఎత్తున నెగెటివిటీ ప్రచారం అవుతుంది..