గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి.. స్థానిక ఎన్నికల విషయంలో చెలరేగిన వివాదం ఇప్పటికీ సద్దుమణగడం లేదు. నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతుంటే ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ససేమీరా అంటూ పలు రకాలుగా ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తుంది.. అయితే నిమ్మగడ్డ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా సంవత్సర కాలంగా ఎన్నికల నిర్వహణ కోసం పోరాడుతూనే ఉన్నాడు.