ఢిల్లీ లో రైతులు చేపడుతున్న దీక్ష రోజు రోజు కి రసవత్తరంగా కొనసాగుతుంది. ఇటీవలే గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన అల్లర్ల విషయం ఎత్త పెద్ద ఎత్తున వివాదం అయ్యిందో అందరికి తెలిసిందే. ట్రాక్టర్ ర్యాలీ పేరున రైతులు పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టి తమ నిరసన ను తెలిపారు. ఎర్రకోటపై జాతీయ జెండా ను కాకుండా వేరొక జెండా ను ఎగరేయడం ఎంతో వివాదాస్పదమైది. ఇది రైతుల ఉద్యమానికి పెద్ద మచ్చగా అయ్యిందని పలువురు విమర్శించారు..