చంద్రబాబు అవినీతి పరుడు.. వేల కోట్లు అవినీతి చేస్తున్నాడు.. ఇది పరమ రొటీన్ విమర్శ.. కానీ ఇప్పుడు వైసీపీ ఇంకో కొత్త విమర్శకు ఊపిరిపోసింది. చంద్రబాబు అవినీతిని ఎంతో కష్టపడి లెక్కకట్టేసింది.. ఆ లెక్క మొత్తం లక్షా 65 వేల కోట్లకు చేరిందట. మొన్ననే విదేశీయాత్రలకు వెళ్లిన చంద్రబాబు ఆ లెక్కలు అవీ చూసుకుని వచ్చాడట. ఇదంతా ఎక్కడ వచ్చిందనుకుంటున్నారా..?

వైసీపీ అధికారికంగా నిర్వహిస్తున్న వెబ్ సైట్లో.. చంద్రబాబు అవినీతి మీద ఓ ఘాటు వ్యాసం ప్రచురించారు. నారా వారు ప్రపంచానికి చెప్పే పాఠాలు - ముఖ్యమైన సబ్జెక్ట్స్ పేరుతో ఉన్న ఈ వ్యాసంలో మొత్తం 21 సబ్జక్టులను ఉదహరించారు. అందులో ఈ స్విస్ అకౌంట్ ఒకటి అన్నమాట. లక్షా అరవైదు వేల కోట్లు స్విస్ బ్యాంకుల్లో దాచినట్టు మోడీకి ఉప్పందగానే తినే అన్నం మధ్యలోనే లేచి బ్యాంకాక్, సింగపూర్ మీదుగా స్విస్ బ్యాంకులకెల్లి ఆ డబ్బుని బినామీ పేర్లమీదకి మార్చడమెలా? అనేది చంద్రబాబు చెబుతారట. 

బాబు అవినీతిపై వైసీపీ కొత్త లెక్క.. 



ఇవి కాకుండా చంద్రబాబు చెప్పే పాఠాలు ఏంటో తెలుసా..  దొంగ రైళ్లలో జేబులో రూపాయి లేకుండా ప్రయాణాలు చేయ్యడమెలా?, కాలేజీలో కులసంఘాలు పెట్టి కలుషితం చెయ్యడమెలా?, నల్లారి అమర్నాధ రెడ్డిలాంటి రాజకీయ గురువులని వాడుకుని పనైపోయాక పంగనామాలు పెట్టడమెలా? మామ ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని గప్పాలు కొట్టడం, ఒక అనామకుడి మీద ఓడిపోయిన వారానికే అదే మామ పంచన చేరడమెలా?.. ఇలాంటివి అన్నమాట. 

తాజా పాఠాల సంగతి చూస్తే.. మతతత్వ పార్టీఅని బీజేపీని తిట్టడం, వాల్లతోనే పొత్తుపెట్టుకుని అధికారంలోకి రావడమెలా?, రాష్ట్రంలోకి ప్రవేశిస్తే అరెస్ట్ చేస్తానన్న మోడీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల ప్రచారం సిగ్గులేకుండా వంగి వంగి సలాములు కొట్టడమెలా?, నేను నిప్పునంటూ ప్రపంచ రాజకీయనాయకులలో అవినీతిలో అగ్రస్థానంలో ఉండటమెలా? మురళీమోహన్, సుజనా చౌదరి, బిల్లీ రావ్, ప్రసాద్ లాంటి అనేకమంది బినామీలని మైంటైన్ చెయ్యడం, రాష్ట్రాన్ని వాళ్లకు దోచిపెట్టడమెలా?

పురంధేశ్వరి, వెంకయ్య నాయుడిలాంటి కులతొత్తులని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలలో ఉంచి తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెల్లడమెలా? ఇలా మొత్తం 21 సబ్జక్టున్నాయి. తమకు నచ్చనివారిని విమర్శించడం సహజమే కానీ.. మరీ ఇంతలా ఉన్నవీ లేనివీ కల్పించి రాస్తే.. క్రెడిబిలిటీ గంగలో కలుస్తుందన్న సంగతి వైసీపీ గుర్తిస్తే బెటర్..  



మరింత సమాచారం తెలుసుకోండి: