తెలంగాణ లోని షాద్ న‌గ‌ర్ ఏరియా ఛ‌టాన్‌ప‌ల్లి బ్రిడ్జి వ‌ద్ద దిశ‌ను న‌లుగురు అత్యంత పాశ‌వికంగా అత్యాచారం చేసి, హ‌త్య చేసి ఆపై ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. దిశ సంఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నిందితులు శుక్ర‌వారం తెల్ల‌వార జామున 3.30 గంట‌ల‌కు ఎన్‌కౌంట‌ర్ లో మృతి చెందారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందినవారు మ‌హ్మ‌ద్ ఆరీఫ్‌, బొల్లు న‌వీన్‌, బొల్లు శివ‌, చెన్న‌కేశ‌వులు. అయితే దిశ సంఘ‌ట‌న జ‌రిగిన తీరుతో దేశం అట్టుడికి పోయింది. ఎక్క‌డ చూసినా దిశ సంఘ‌ట‌న‌పైనే ప్ర‌జ‌లు దృష్టి సారించారు. దిశ‌కు ఈ గ‌తి ప‌ట్టించిన కీచ‌కుల‌కు అదే గ‌తి ప‌ట్టింది. అయితే ఈ ఎన్‌కౌంట‌ర్‌తో ఇప్పుడు స‌త్వ‌ర న్యాయం జ‌రిగింద‌న‌ట్లేనా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

దిశ సంఘ‌ట‌న  తీరుతెన్నుల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. నవంబ‌ర్ 27న దిశ విధులు ముగించుకుని సాయంత్రం 6.30గంట‌ల‌కు ఇంటికి బ‌య‌లు దేరింది. అయితే ఈ నిందితులు కావాల‌నే ఓ ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కారం దిశ బైక్ గాలి తీశారు. త‌రువాత దిశ షాద్‌న‌గ‌ర్ ప్రాంతంలోని చ‌టాన్‌ప‌ల్లి బ్రిడ్జి వ‌ద్ద‌కు రాగానే బైక్ గాలి పూర్తిగా పోయింది. దీంతో అక్క‌డే అందుబాటులో ఉన్న ఈ న‌లుగురు నిందితులు ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం దిశ వ‌ద్ద‌కు చేరుకుని అమెను ట్రాప్ చేసి బైక్‌ను బాగు చేసే నిమిత్తం చేసిన నాట‌కం, ఆపై నిర్మానుష్య ప్రాంతానికి త‌ర‌లించి అత్యాచారం, స‌జీవ ద‌హ‌నం చేశారు.

 

దీన్ని సీరియ‌స్‌గా ప‌ట్టించుకున్న పోలీసులు మ‌రుస‌టి రోజే నిందితుల‌ను గుర్తించి, త‌రువాత వారిని పోలీసులు వెంట వెంట‌నే విచార‌ణ చేయ‌డం, న‌వంబ‌ర్ 30న జ్యూడిషియ‌ల్ క‌ష్ట‌డికి, చ‌ర్ల‌ప‌ల్లి జైలులుకు త‌ర‌లించ‌డం జ‌రిగింది. త‌రువాత ఈ కేసులో స‌త్వ‌ర న్యాయం చేయాల‌ని ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ‌చ్చిన నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకుంది.

 

తెలంగాణ స‌ర్కారు గ‌తంలో వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న ను మ‌న‌నం చేసుకుంది. అదే త‌ర‌హాలో నిందితుల‌కు స‌త్వ‌ర శిక్ష‌లు ప‌డాల‌ని ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కు తెలంగాణ పోలీసులు కేసు విచారణ నిమిత్తం పోలీసు క‌ష్ట‌డికి ఇవ్వాల‌ని పిటిష‌న్ వేయ‌డం, దీంతో కోర్టు పోలీసు క‌ష్ట‌డికి ఇవ్వ‌డం జ‌రిగింది. ఈనెల 4న పోలీసులు క‌ష్ట‌డికి తీసుకుని 5వ తేదిన పూర్తి స్థాయిలో పోలీసు స్టేష‌న్‌లో విచారించారు. విచార‌ణ లో భాగంగా 5వ తేది రాత్రి నుంచి సంఘ‌ట‌న ప్ర‌దేశంలో సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేసే క్ర‌మంలో నిందితులు తిరుగుబాటు చేయ‌డం, దీనికి ప్ర‌తిగా పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంతో న‌లుగురు హంత‌కులు హ‌త‌మ‌య్యారు.

 

న‌వంబ‌ర్ 6న జ‌రిగిన ఈ ఎన్‌కౌంట‌ర్‌తో దిశ క‌థ‌కు ముగింపు ప‌లికారు పోలీసులు. వాస్త‌వానికి ఈ కేసులో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల డిమాండ్ నెర‌వేరింది. దిశ కుటుంబ స‌భ్యుల‌కు స‌త్వ‌ర న్యాయం దొరిన‌ట్లైంది. ఏదైమైనా ఈ కేసులో పోలీసులు స‌త్వ‌రంగా స్పందించి స‌రైన ముగింపు ఇచ్చార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: