దిశ అత్యాచారం, హత్య కేసు నిందితులను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వీళ్లకు మొదటి నుంచి రాజభోగాలే లభిస్తున్నాయన్న వాదనలు, వార్తలు మీడియాలో వచ్చాయి. ఇప్పుడు వీళ్లు చచ్చినా.. అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. సాధారంగా ఇలాంటి ఎన్ కౌంటర్ల విషయంలో మృత దేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ పోస్టు మార్టం చేసిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.

 

కానీ.. దిశ రేపిస్టుల విషయంలో మాత్రం వారి మృతదేహాల వద్దకే వైద్యులను రప్పిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికే వైద్యులను రప్పించి పోస్టుమార్టం చేయిస్తున్నారు. గతంలోనూ ఎన్ కౌంటర్ రేపిస్టులకు సకల సౌకర్యాలు అందాయన్న వాదన ఉంది. రేపిస్టులను అదుపులోకి తీసుకున్న మరుసటి రోజు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. సాధారణంగా ఇలాంటి రేపిస్టులకు ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు.

 

కానీ వీరి విషయంలో అన్నీ వీరి వద్దకే వచ్చాయి. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సమయంలో జనం వారిని తమకు అప్పగించాలంటూ పెద్ద ఎత్తున గుమిగూడారు. దాంతో వారిని ఆసుపత్రికి, మెజిస్ట్రేట్ ముందుకు తరలించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. దాంతో వైద్యులను, మెజిస్ట్రేటును వారి వద్దకే రప్పించి ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ఆ తర్వాత వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

 

వారిని చంచల్ గూడ జైలుకు తరలించింది ఆదివారం కావడంతో.. వారికి జైలులో తొలిరోజే మటన్ కర్రీతో భోజనం పెట్టారు. ఇలా అడుగడుగునా వారికి ప్రివిలేజ్ లభించిందన్న వాదన ఉంది. ఇక ఇప్పుడు చచ్చాక కూడా వారికి మర్యాదలు తగ్గడం లేదు. వైద్యులే వారి మృత దేహాల వద్దకు వచ్చి పోస్టుమార్టం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: