యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తండ్రి దివంగత నేత ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తొలిసారిగా ఆంధ్రకు 2009లో జరిగిన ఎన్నికల్లో కడప పార్లమెంట్ నియోజవర్గం నుండి ఎంపీగా భారీ మెజార్టీ తో గెలుపొందారు. కాగా తొలిసారిగా వైఎస్ 2004లోను, ఆ తరువాత రెండవసారి 2009లోను ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా ఆయన తండ్రి వైఎస్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన మూడు నెలల్లోనే వైఎస్, ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఇక అక్కడి నుండి అప్పటి కాంగ్రెస్ నాయకులు అనేకమంది నుండి వ్యతిరేకత ఎదుర్కొన్న జగన్,

 

ఆ తరువాత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. అప్పటి నుండి ప్రజలకు చేరువవుతూ పలు విధాలుగా వారి మధ్యనే తిరిగారు జగన్. అయితే అప్పట్లో కాంగ్రెస్ నుండి బయటకు రావడం జగన్ ను ఒకింత శాపంగా మారింది. ఆయనపై పలు ఆర్ధిక నేరాలు మోపబడడంతో పాటు కొన్నాళ్ల విచారణ తరువాత ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన అనంతరం బెయిలు పై ఆయన బయటకు వచ్చారు. ఆతరువాత ప్రజల్లోకి వెళ్లిన జగన్, ఉమ్మడి ఆంధ్ర విడిపోయి 2014లో నవ్యాంధ్రకు జరిగిన ఎన్నికల బరిలో నిలిచారు. కాగా అప్పట్లో రెండొంతుల మెజారిటీ సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అయినప్పటికీ ప్రజల తీర్పును గౌరవిస్తూ ముందుకు సాగిన జగన్, 

 

ఆ సమయంలో అనేక విధాలుగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ఆ తరువాత ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం 3500 కు పైగా కిలోమీటర్లు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని, తదుపరి ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే, తప్పకుండా వారికి అన్ని విధాలుగా అండగా నిలబడతాం అని భరోసా ఇచ్చారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అనంతరం తొలిసారిగా సీఎం గా పీఠాన్ని అధిష్టించారు. ఇక అక్కడి నుండి, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, వాగ్దానాల మేరకు ఎప్పటికపుడు వాటిని నెరవేరుస్తూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. కాగా గతంలో పలు విధాలుగా జగన్ గారిపై ఎన్ని కుట్రలు పన్నడం, ఇక ఆయన పని అయిపోయిందని తప్పుడు ప్రచారాలు చేయడం వంటివి చేసారు. కానీ వాటన్నిటినీ లక్ష్య పెట్టకుండా మొక్కవోని దీక్షతో గుండె ధైర్యంతో ముందుకు సాగి, ప్రజల మెప్పుతో విజయ దుందుభి మ్రోగించారు జగన్. ఇక నేడు జన్మదినం జరుపుకుంటున్న ఆయనకు పలువురు రాజకీయ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు......!!    

మరింత సమాచారం తెలుసుకోండి: