చైనాలో కోవిడ్-19 మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది. హుబెయ్ ఫ్రావిన్సులో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.  ఒక్క రోజులోనే ఈ ప్రాంతంలో 139 మంది మృతి చెందారు.  ఇక ఆసియా దేశాల్లో కోవిడ్-19  వ్యాప్తి పెరుగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు పలు దేశాలు దేశాలు విస్తృత చర్యలు తీసుకుంటున్నాయి.  

 

కోవిడ్ -19 పంజా విసురుతోంది. చైనాలో ఈ వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 17 వందలు దాటింది.  వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.....వ్యాప్తి తగ్గడం లేదు. చైనాలో కొత్తగా 18వందల 43 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే గతంతో పోలిస్తే వైరస్ సోకిన వారి సంఖ్య కొంత తగ్గుముఖం పడుతున్నట్లు చెప్తున్నారు. చైనాలో వైరస్ బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 69 వేలు దాటింది.

 

చైనాలో ఒక్కరోజే కోవిడ్-19 మహమ్మారి ధాటికి 139 మంది మృతి చెందారు. వీరంతా చైనాలోని హుబెయ్ ఫ్రావిన్సుకు చెందినవారే కావడం గమనార్హం. ఈ ప్రాంతంలోనే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో వైరస్ కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.

 

రెండు వారాల నుంచి జపాన్ నౌకలో చిక్కుకొని ఉన్న అమెరికా పౌరుల్ని తీసుకేళ్లేందుకు ఆ దేశం ప్రత్యేక విమానం పంపింది. ఇప్పటికే ఈ నౌకలో 285 మందికి కోవిడ్-19 వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మరోవైపు కాంబోడియా తీరంలో ఆగిన మరో నౌక వెస్టర్ డ్యామ్‌లో ఓ అమెరికా మహిళకు వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇప్పటికే అందులోని ప్రయాణీకులను బయటకు తీసుకువచ్చారు.

 

ఆసియా దేశాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. భారత్‌లో కోవిడ్-19 ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ సింగపూర్‌లో మరో ఐదుగురికి వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 72కు చేరింది. బహిరంగ ప్రదేశాల్లో తీసకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేసింది సింగపూర్ ప్రభుత్వం. టాయిలెట్‌ పేపర్లు, కాగితంతో తయారు చేసిన రుమాళ్లు, మాస్కులు, చేతుల్ని శుభ్రం చేసుకునే లిక్విడ్లకు హంకాంగ్‌, సింగపూర్‌లలో కొరత ఏర్పడింది.

 

ఇక చైనాలో కరెన్సీ తగ్గించాలని ప్రజలను కోరింది ప్రభుత్వం. దీంతో కట్టలుగా కరెన్సీని గోదాముల్లోకి తరలిస్తున్నారు. ఇ-కామర్స్‌, నెట్‌ బ్యాంకింగ్‌ వాడుకోవాల్సిందిగా ప్రభుత్వ వర్గాలే  సూచిస్తున్నాయి.  వుహాన్‌లోని ఆస్పత్రుల్లో రోగులకు కావాల్సినవి అందించడానికి రోబోలను రంగంలో  దించారు. చైనాలోని అన్ని ప్రాంతాల నుంచి 25 వేల మందికి పైగా వైద్యుల్ని హుబెయ్‌ ప్రావిన్స్ కు పంపించారు.

 

చైనాలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకునేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక వైద్య బృందాన్ని పంపింది.  మరోవైపు చైనాలో 17 వందల మంది ఆరోగ్య సిబ్బందికి కూడా వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: