2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర ఓటమి పాలైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్ర రాజకీయాలను  ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నారు. విపక్ష పార్టీ కంటే ఎక్కువ అధికార పార్టీపై విమర్శలు  చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఇక తాజాగా ఆదివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసైనికులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేనాని. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంతగానో చూపిందని.. ఎన్నికల్లో డబ్బు పంచిన  అభ్యర్థులు ఓడిపోయిన వాళ్లు బయట ఏడిస్తే గెలిచిన వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్లి ఏడ్చారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసిపి పార్టీని నమ్మి ఓటు వేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు పనులు జరగడం లేదంటూ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు ఎంతో సత్యం బోధపడింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

 

 

 ఎవరు మన వాళ్ళు... ఎవరు కాదు అనేది  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అర్థమైంది అన్నారు జనసేనని. ఈమధ్య కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు... తనకు కొంత మంది ఓ విషయం చెప్పారని... ప్రతి వార్డులో  ఐదుగురు జనసేన కార్యకర్తలు ఉంటే కనీసం 500 మందికి పైగా తన అభిమానులు ఉన్నారని... కానీ వాళ్ళు ఎవరు కూడా జనసేన పార్టీకి ఓటు చేయలేదని తెలిసింది అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను  కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు భారీ సంఖ్యలో హాజరై జేజేలు  పలికిన అభిమానులు ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీకి ఓటు వేయలేదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

 

 

 ఎన్నికల సమయంలో చాలా మంది కులం వర్గం ప్రలోభాలకు లొంగిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ కోసం నిలబడిన వాళ్ళు మాత్రం చాలా బలంగా పనిచేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఒక  రోగిని  ఎలాగైనా బాగు చేయాలని డాక్టర్ ఎలా అనుకుంటాడో... అనేక రుగ్మతలు ఉన్న ఈ సమాజాన్ని బాగు చేయాలని నేను కూడా అలాగే అనుకుంటున్నాను అంటూ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి విషయంలో తాను ఊహించిందే నిజమైంది అంటూ వ్యాఖ్యానించింది పవన్ కళ్యాణ్... రాష్ట్ర ప్రజల గౌరవానికి సంబంధించిన రాజధానిని రెండు కులాల మధ్య గొడవల మార్చేసారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది అక్షరాల నిజం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మార్చి కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడం జనసేన కు మాత్రమే సాధ్యమవుతుంది  అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: