ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తున్నారూ సీఎం జగన్ . ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయం  తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ . ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలు మద్యానికి బానిసలు గా మరి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి సర్కార్ సంపూర్ణ మద్యపాన నిషేధం అనే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సంపూర్ణ మద్యపాన నిషేధం నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంది జగన్ సర్కార్. 

 


 ఈ క్రమంలోనే మొదటి దశగా.. రాష్ట్రంలోని మద్యం షాపులను  మూసివేసి ప్రభుత్వమే మద్యం షాపులను ఆధీనంలోకి తీసుకొని నడుపుతోంది. రాష్ట్రంలోని మద్యం షాపులను బార్లను 20 శాతం మేరకు తగ్గించి...   మద్యం ధరలు భారీగా పెంచారు.. సామాన్య ప్రజలకు మద్యం   అందుబాటులో ఉండకుండా చేసేందుకు మద్యం ధరలను మూడింతలు పెంచింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. దీనిపై విపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు సంపూర్ణ చిత్రం దిశగా ముందుకు సాగింది. అయితే ధరలు భారీగా పెరగడంతో... మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి ఈ నేపథ్యంలో ఎంతో మంది సామాన్య ప్రజలు మద్యానికి దూరంగానే ఉంటున్నారు.

 

 

 ఇక ఇంకొన్ని రోజుల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం ధరలు పెంచడంతో పాటు మద్యం షాపులను తగ్గించి... మద్యం షాపుల సమయం వేళలు కూడా కుదించింది . ఇక ఇప్పుడు కేవలం వారంలో నాలుగు రోజులు మాత్రమే మద్యం షాపులు పని చేసేలా  జగన్ మోహన్ రెడ్డి సర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ సర్కార్ నిర్ణయం తో అటు మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే  మద్యపానం నిషేధం జరగడంతో సారా అమ్మకాలు కూడా జరగకుండా ఎన్నో చర్యలు చేపడుతుంది జగన్ సర్కారు. మరి మద్యపాన నిషేధం పై ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం స్థానిక ఎన్నికల్లో తెలియనుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: