బ్లాక్ మెయిల్ చేయటం చంద్రబాబునాయుడు, టిడిపి నేతలకు బాగా అలవాటైపోయింది. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జరిగిన రగడ విషయంలో కూడా పోలీసుల విషయంలో చంద్రబాబు, టిడిపి నేతలు ఏ విధంగా వ్యవహరించారో అందరూ లైవ్ లో చేసిందే. తమ రక్షణగా నిలిచిన పోలీసులనే చంద్రబాబు నోటికొచ్చినట్లు తిట్టారు. పనికిమాలిన ప్రచారం కోసమని రెచ్చిపోయి పోలీసు అధికారులను నోటికొచ్చినట్లు మాట్టాడిన విషయం అందరూ చూసిందే.

 

ఉత్తపుణ్యానికి వాళ్ళతో గొడవపడిన చంద్రబాబు తనను షూట్ చేసేయమన్నాడు. ఎన్ కౌంటర్ చేయమని, జుట్టుపట్టుకుని కొట్టమని పదే పదే రెచ్చిపోయాడు. అంటే తాను రెచ్చిపోయినట్లు నటిస్తు వాళ్ళని రెచ్చగొట్టేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎన్ని విన్యాసాలు చేసినా చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. ఎందుకంటే ఏ దశలో కూడా పోలీసులు ఎక్కడా రెచ్చిపోకుండా చాలా ఓపికతో వ్యవహరించారు. దాంతోనే చంద్రబాబు డ్రామా పెద్దగా ఫలించలేదు.

 

నిజానికి పోలీసులు రక్షణగా నిలవబట్టే చంద్రబాబు సేఫ్ గా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పోలీసులే గనుక ప్రభుత్వం చెప్పినట్లో లేకపోతే వైసిపి అధికారుల ఒత్తిడికి లొంగిపోయుంటే చంద్రబాబు పని గోవిందానే. ఎందుకంటే చంద్రబాబును రక్షణగా  ఒకవైపు టిడిపి నేతలు, కార్యకర్తలు అడ్డుకునేందుకు మరోవైపు వైసిపి కార్యకర్తలు, జనాలు మోహరించారు. రెండు వైపులా రెచ్చిపోతున్న వాళ్ళ విషయంలో పోలీసులు ఓపిగ్గా నచ్చచెప్పారు. అప్పటికీ ఒకటి రెండు కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ ప్యాకెట్లు చంద్రబాబు వాహనం పైన పడుండచ్చు.

 

అదే గనుక ఒత్తిడికి లొంగిపోయి పోలీసులు గనుక వైసిపి కార్యకర్తలను జనాలను వదిలేసుంటే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలపై దాడి చేసేవారనటంలో సందేహం లేదు. చంద్రబాబుకు ఎంత భద్రతున్నా పబ్లిక్ ఒక్కసారిగా వచ్చి మీద పడితే రక్షించాల్సింది మళ్ళీ రెగ్యులర్ పోలీసులే అన్న విషయం మరచిపోకూడదు. ఇక్కడ పోలీసులు చేసిందదే. ఒకవైపు ఆందోళనకారులకు నచ్చచెబుతునే మరోవైపు ఎవరు కూడా చంద్రబాబు వైపుకు రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా చివరకు పోలీసులు చంద్రబాబు దగ్గర మాటలు పడాల్సి రావటమే విచిత్రం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: