పాపం.. ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎంత బ్యాడ్ టైమ్ అంటే.. బహుశా ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ మరీ ఇంత బ్యాడ్ టైమ్ ఎప్పుడూ వచ్చి ఉండదు. లేకుంటే ఏంటి చెప్పండి.. ఎలాంటి కష్టకాలంలోనైనా పార్టీని అంటి పెట్టుకునే సన్నిహితులు, శ్రేయోభిలాషులు కూడా ఇప్పుడు పార్టీ వదలి వెళ్లిపోతున్నారు. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యే బాలయ్యకు ఇది మరీ బ్యాడ్ టైమ్ లా ఉంది.

 

 

ఎందుకంటే.. బాలయ్యకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న కదిరి బాబూ రావు కూడా ఇప్పుడు చివరకు జగన్ పార్టీలో చేరిపోయారు. అంతే కాదు. చేరడమే కాకుండా.. బాలయ్య బావ చంద్రబాబు గురించి నానా మాటలూ అంటున్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, నమ్మక ద్రోహం చేయడంలో చంద్రబాబు దిట్ట అని కదిరి బాబూరావు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో వైయస్‌ఆర్‌ సీపీలో చేరానని కదిరి బాబూరావు అన్నారు.

 

 

బాలకృష్ణతో ఉన్న స్నేహంతోనే తాను ఇన్నాళ్ల నుంచి టీడీపీలో ఉన్నానని తేల్చి కదిరి బాబూరావు తేల్చి చెప్పారు. నందమూరి వారికి, నారా వారికి చాలా తేడా ఉందన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం బాలకృష్ణ చెప్పిన మాటలను కూడా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని కదిరి బాబూరావు ఆరోపించారు. అందుకే చంద్రబాబు లాంటి నమ్మక ద్రోహి దగ్గర ఇమడలేకపోయారన్నారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని కదిరి బాబూరావు అన్నారు.

 

 

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి 34 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించానని, అలాంటి తననే చంద్రబాబు మోసం చేశాడని బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకంతో తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరానన్నారు. చంద్రబాబు చేసే భయంకరమైన మోసాలు భరించలేక కదిరి బాబూరావు టీడీపీని వీడారని వైయస్‌ఆర్‌ సీపీ నేత తోట త్రిమూర్తులు అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: