ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాప్తి చెందుతున్న  నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిట్  లిస్టులో చేరిపోయాడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 147 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించిన నేపథ్యంలో ... ఓవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు భారత ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతున్న సమయంలో... ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మాత్రం ఎన్నికలే ముఖ్యం అయ్యాయి అంటు చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

 

 కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో  స్థానిక ఎన్నికలను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్... జగన్మోహన్ రెడ్డి హిట్ లిస్ట్ లో చేరిపోయారు అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అయి ఉండి కరోనా  వైరస్ రాష్ట్రంలో వ్యాపించి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క  సమీక్ష కూడా పెట్టలేదని... కేవలం వీడియో గేమ్స్ మాత్రమే ఆడుకుంటూ కరోనా  సోకితే 60 ఏళ్ల పైబడిన వారు మాత్రమే చనిపోతారు అంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జగన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కరోనా  వైరస్ కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. 

 


 కరోనా  వైరస్ సోకి ప్రజల ప్రాణాలు పోతున్నా సరే కానీ మీకు మాత్రం ఎన్నికలే ముఖ్యమా అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నేతల పై జరిగిన దాడి గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు. నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అందరిని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు అంటూ కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు. ప్రజలు ఓట్లు వేస్తారు అని నమ్మకం ఉన్నప్పుడు టీడీపీ నేతలపై వైసీపీ ఎందుకు దాడులకు పాల్పడుతోంది అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: