దేశంలోనే అతి తక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా మరో కరోనా కేసు నమోదైంది. స్వీడన్ నుంచి విజయవాడకు వచ్చిన 28 ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్ అని కన్‌ ఫామ్ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ యువకుడు ఈ నెల 18స్వీడన్ నుండి డిల్లీ చేరుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నాడు.

 

 

వచ్చినప్పుడు ఆరోగ్యంగానే ఉన్న ఈ యువకుడికి ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఇక ఉగాది రోజున కరోనా లక్షణాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇక ఏపీలోని మిగిలిన కరోనా వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటివరకు 360 నమూనాలను టెస్టులకు పంపగా.. 317 నెగెటివ్ వచ్చాయి. మరో 32 శాంపిల్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

 

 

ఇక ఏపీలో కరోనా కేసులు తక్కువగా ఉన్నా.. జనంలో ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ప్రత్యేకించి విశాఖ వంటి నగరంలో మూడు పాజిటివ్ కేసులు ఉండటంతో ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఏపీలో కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.

 

 

గ్రామ వాలంటీర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠినమైన కేసులు తప్పవని.. ఏపీ మంత్రులు చెబుతున్నారు. జిల్లాల వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఓ వ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి విదేశాల నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అధికారులు పరీక్షలు నిర్వహించారు. అయితే కుటుంబ సభ్యులందరికీ నెగటివ్‌గా రిపోర్టు వచ్చింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: