ప్రస్తుతం భారతదేశాన్ని కరోనా  వైరస్ కబళిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయని ప్రయత్నం అంటూ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఇక ఈ మహమ్మారి వైరస్ కు వాక్సిన్   లేకపోవడం కూడా ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. అయితే మొదట్లో భారతదేశంలో అతి తక్కువగా నమోదైన కేసులు క్రమక్రమంగా ఎక్కువ మొత్తంలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 67 వేలకు చేరుకుంది. దీంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. 

 

 

 అయితే తాజాగా కరోనా పై పోరాటం లో హెల్త్ కేర్ రంగానికి కేటాయింపులు ఇవ్వాలని మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తాజాగా రాజస్థాన్ జైపూర్లో ఐఐహెచ్ఎంఆర్ ఒక సెమినార్  కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన డేవిడ్ బిషాయ్ అనే నిపుణుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. ఈయన బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ జాన్స్ హాప్కిన్స్   యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. వచ్చే రెండేళ్లలో  దేశం లో వైరస్ కి వ్యాక్సిన్  అందుబాటులోకి రాకపోతే .. పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని అందుకనే 60 నుంచి 70 శాతం మంది ఈ వైరస్ ను  తట్టుకునే వ్యాధి నిరోధక శక్తిని అయితే బాగుంటుంది అని  అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 

 కనీసం ఈ వైరస్ తయారీకి ఇంకో ఏడాది సమయం పట్టే అవకాశం ఉన్నందున దేశంలో ఈ వైరస్ కోటి మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయితే కోటిమందికి వైరస్ వ్యాప్తి అయితే వ్యాక్సిన్ లేకుండా ఈ వైరస్ను అడ్డుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి... దాదాపుగా దేశంలోని 60 నుంచి 70 శాతం మంది ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగితే వైరస్ అడుక్కోడంచ్చు అంటు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో వందకుపైగా వ్యాక్సిన్లు  తయారవుతున్నాయి... వ్యాక్సిన్ లు  ఏకంగా మనుషుల్లో తొలిదశ ప్రయోగాల్లో కూడా సక్సెస్ అయ్యాయి. దీంతో తొలి వ్యాక్సిన్ అక్టోబర్ నాటికి వస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇక ఇండియాలో భారత్ బయోటెక్ వాక్సిన్  తయారీలో ముందున్నమని  చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: