గతంలో చైనాకు భారతదేశానికి మధ్య ఉన్న సంబంధాలు ఏకపక్షంగా ఉండేవి. చైనా దేశం ఏది చెప్తే డానికి భారత్  అందుకు అంగీకరించేది . చైనా దేశం ఏం చేసినా దానికి సైలెంట్ గానే ఉండిపోయేది భారత్. ఏకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో చైనా దారుణంగా వ్యవహరించినప్పటికీ భారత్ ఏదో చిన్న నిరసన తెలిపి సైలెంట్ గానే ఉరుకుందు. కానీ ఎప్పుడైతే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టారో  అప్పటినుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చైనా ఎలాంటి వ్యూహం పన్నిన ప్రస్తుతం భారత సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. గతంలో లాగా ప్రతి విషయంలో ప్రస్తుతం సైలెంట్ గా ఉండకుండా చైనా వ్యూహాలను  సమర్థవంతంగా సమాధానం చెబుతుంది భారత్. 

 


 ప్రస్తుతం తైవాన్ హంకాంగ్ తో భారత్ కి సంబందాలు  రోజురోజుకు పెరిగిపోతోన్నాయి . తైవాన్ భారత్ మధ్య వాణిజ్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. తైవాన్  భారత్ మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి .. అంతే కాకుండా వాణిజ్య వ్యవహారాలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి.  భారత్ నుంచి ఎంతోమంది విద్యార్థులు ప్రస్తుతం తైవాన్  విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వెళుతున్నారు . మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ భారత్ తైవాన్ కి  అండగా నిలబడ్డారు. 

 


 తైవాన్ లో భారతదేశానికి అధికారిక మిషన్ లేకపోయినప్పటికీ... తైవాన్ భారత్ మధ్య ఉన్న సంబంధాలను భారీఎత్తున పెంచింది . అయితే మోడీ  అధికారంలోకి వచ్చిన జరుగుతున్న ఇలాంటి విషయాలు చైనాకు మాత్రం చిరాకు కలిగిస్తున్నాయి . ఎందుకంటే తాము చెప్పినట్టే అన్ని దేశాలు వినాలని చైనా  అనుకుంటుంది. దీంతో ప్రస్తుతం భారత్ తైవాన్ వ్యవహరిస్తున్న తీరు చైనాకు నచ్చడం లేదు. అయితే చైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో తల దూర్చడం తో దానికి బదులుగా ప్రస్తుతం చైనాకు మరింత  ఆగ్రహం తెప్పించే లా భారత్ తైవాన్ హంగాంగ్ లతో సత్సంబంధాలను భారత మెరుగు పరుచుకుంటూ ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: