పట్నాల్లో ఉండేవాళ్లకు తెలియదు కానీ.. పల్లెటూళ్లలో.. అందులోనూ మారుమూల పల్లెల్లో ఉండేవారి తెలుస్తుంది వైద్యం విలువ ఏంటో.. సరైన వైద్యసదుపాయాలు లేక ఏటా రాలిపోయే ప్రాణాలెన్నో.. ఓ గంట ముందు తీసుకొస్తే బతికేవాడు.. అని వైద్యులు అంటుంటే.. చేతుల్లోనే బిడ్డ ప్రాణాలు పోతుంటే.. తండ్రి అనుభవించే బాధ నరకమే.

 

 

అలాంటి మరణాలను తప్పించేందుకు.. మారుమూల పల్లెలకూ వైద్యం అందించేందుకు జగన్ సర్కారు మరో అద్భుతసేవలను పల్లె ముందుకు తెస్తోంది. అవే 104, 108 వాహనాలు. అదేంటి.. ఇది పాతదేగా.. అంటారా.. ఇది పాతదే .. కానీ.. 104, 108 వాహనాలను పట్టించుకునే నాధుడు లేదు. వాటిలో కనీస సౌకర్యాలు ఉండవు. ఫోన్ చేస్తే వాహనం అందుబాటులో ఉండదు.

 

 

అందుకే జగన్ సర్కారు వాటిని ప్రక్షాళన చేసింది. ప్రతి మండ‌లానికి ఒక కొత్త అంబులెన్స్ ఏర్పాటు చేయాల‌ని సంకల్పించింది. ప్రతి మండ‌లానికి ఒక 104, 108 వాహ‌నాన్ని కేటాయించింది. ప్రతి గ్రామీణ ప్రాంతానికి, ఏజెన్సీ ప్రాంతాని ఈ సేవ‌లు అందించేందుకు కొత్తగా 108 వాహ‌నాలు 474 కొనుగోలు చేశారు. మొత్తం 1068 కొత్త వాహ‌నాల‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.

 

 

ఇక రూర‌ల్ ఏరియాలో ఫోన్ చేసిన 20 నిమిషాల్లో 108 వాహ‌నం అందుబాటులో ఉంటుంది. అర్బన్ ఏరియాలో 15 నిమిషాల్లో అందుబాటులో ఉంటుంది. 108 వాహ‌నాల్లో అడ్వాన్స్‌డ్‌లైవ్ స‌పోర్టు వాహ‌నాలు 104, బెసిక్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 274, శిశు మ‌ర‌ణాలు త‌గ్గించేందుకు జిల్లాకు రెండు చొప్పున ప్రవేశ‌పెడుతున్నారు. లైఫ్ రిస్క్ నుంచి కాపాడేందుకు 100 అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. 104 వాహ‌నంలో గ‌తంలో కొన్ని ర‌కాల టెస్టులు మాత్రమే చేసేవార‌న్నారు. ఇప్పుడు 72 ర‌కాల మందులు ఇవ్వబోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: