వ్యాపారం అంటే ఏ వ్యాపారం చెయ్యాలి..? ఎలా చెయ్యాలి అనే తికమక ఇప్పుడు వద్దు. కేంద్రం మీకు మంచి సలహాలు మంచి అవకాశాలు కలిపిస్తోంది. అదే హనీ బిజినెస్. ప్రపంచంలో తేనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న టాప్-5 దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే 2005-06 నుంచి చూస్తే దేశంలో తేనె ఉత్పత్తి ఏకంగా 242 శాతం పెరిగింది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వం తేనె ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం కూడా ఇవ్వడం చూస్తున్నాం. దీనికి రూ.500 కోట్లు కేటాయించింది.
ఇలాంటి అవకాశం కల్పిస్తోంది కనుక మీరు కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చెయ్యవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా తేనె ఉత్పత్తిని ప్రారంభించొచ్చు. అది కూడా ఎంతో సులువుగా. మీరు మాత్రం దీని కోసం హనీ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే.. కేంద్ర ప్రభుత్వం పక్కా సాయం చేస్తుంది. ఇది ఖాదీ గ్రామోద్యోగ్ స్కీమ్ కింద ఆర్థిక తోడ్పాటు కల్పిస్తుంది. మీకు 25 శాతం సబ్సిడీ కూడా లభిస్తుంది. అంటే మీరు ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం భరిస్తే సరిపోతుంది. కేవీఐసీ కింద 65 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు. కాబట్టి ఈ వ్యాపారం చేస్తే తప్పక లాభం వస్తుంది అంతే కాకుండా కేంద్రం కూడా సహాయం చేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి