కరోనా కారణంగా ఎంతోమంది ఉపాధిని కోల్పోయి కష్టాలబారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో వారి వారి అభిరుచికి తగినట్లు చిన్న చిన్న వ్యాపారాలపై దృష్టి సారించారు. కొందరేమో కూరగాయలు అమ్మడం, మరి కొందరు టిఫిన్ షాప్ పెట్టుకోవడం మొదలైనవి. అయితే కొందరు ఆశావహులయితే ఊహించని వ్యాపారాలవైపు అడుగుపెడుతున్నారు. డ్రగ్స్ వ్యాపారం మరియు వ్యభిచార గృహాలు నడపడం, అయితే ఇవి చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలని తెలిసి కూడా చేస్తుండడం ఆశ్చర్యకర విషయం. ఇలాంటిదే ఓ సంఘటన విశాఖపట్నం లో జరిగింది. ఇంతకీ ఏమిజరిగిందో ఏపీహెరాల్డ్ ఆర్టికల్ పై ఓ లుక్ వేయండి.
 
విశాఖపట్నంలోని గాజువాకలో చాలా గోప్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. కొందరి ఇచ్చిన పక్కా సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న టాస్క్ ఫోర్స్  పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు జరిపారు. ఈ దాడిలో కొందరి యువతులను, విటులను మరియు దీని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కుంచల కృష్ణ, శ్రీనివాసరావు, కె.హరి సన్యాసిరావు,  కమల అనే వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పాడి ఇక్కడ ఈ వ్యవహారాన్ని ప్రారంభించినట్టు తెలిసింది. ఇందుకు విశాఖ శివారు ప్రాంతంలోని గాజువాక సరియైన సురక్ష ప్రాంతంగా ఎంచుకున్నారు.

మరో చోద్యం ఏమిటంటే ఈ వ్యభిచార గృహం పక్కనే ఉన్న ఎస్ఎఫ్ఎస్ పాఠశాలకు అతి దగ్గర కావడం. కనీసం స్కూలు పక్కన అని కూడా లేకుండా ఇంతటి సంఘ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడం చాలా దురదృష్టకరమని చుట్టుపక్కలవారు తిట్టిపోస్తున్నారు. వీరు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నారు. నిన్న సాయంత్రం పోలీసులు సంఘటనా స్థలం మీద ఒక్కసారిగా దాడి చేయడంతో, ఈ చీకటి వ్యాపారం వెలుగులోకిి వచ్చింది. ఈ సందర్భంగా ముగ్గురు యువతులు, ఒక విటుడు, ఇద్దరు మధ్యవర్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తును వేగవంతం చేశారు. ఇకనైనా ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: