నేరస్తుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి అయిన నీరవ్ మోదీ సోదరి పూర్వి. తమ అన్న చేసిన నేరాలకు...తమ జీవితాలు నాశనమైపోయాయంటూ కోర్టు మెట్లెక్కింది. ఆమె భర్త మయాంక్ మెహతా కూడా ఇదే తరహాలో బావమరిది నీరవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ ని 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ... కాగా లండన్ జైల్లో ఉన్న నీరవ్‌ను తిరిగి భారత్‌కు అప్పగించేందుకు విచారణలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో నీరవ్ కు గట్టి షాక్ తగిలినట్లయింది.
ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను మా దగ్గర ఉన్నాయని, అనుమతిస్తే వాటిని కోర్టు ముందు ఉంచుతామని... అలాగే అప్రూవర్‌గా మారేందుకు ఇష్టంగా ఉన్నామని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నీరవ్ సోదరి పూర్వి మరియు ఆమె భర్త మెహతా. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించి వేడుకోగా.... వీరిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు అనుమతించింది. వారి ఆవేదనను... క్షమాపణలను విన్న తరువాత నీరవ్ చెల్లెలు పూర్వి మోదీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు నిర్ణయించింది.
దీంతో ఈ విషయం ప్రభంజనం గా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నీరవ్ సోదరిపూర్వి మరియు తన భర్త మెహతా బయట పెట్టబోయే సాక్షాలు ఏమై ఉంటాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఆధారాల ద్వారా ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి