ఇక భారత అమ్ములపొదిలో ఎంతో శక్తివంతమైన యుద్ధ విమానం గా ఉన్న రఫెల్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఏ క్షణంలో యుద్ధం తలెత్తిన కూడా చైనాను మట్టికరిపించేందుకు భారత్ ప్రస్తుతం సరిహద్దుల్లో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి వివిధ రకాల రక్షణ ఆయుధాలను సరిహద్దుల్లో తరలిస్తుంది భారత ఆర్మీ. అదే సమయంలో ఇటీవలే జిన్పింగ్ ప్రకటన నేపథ్యంలో భారత ఆర్మీ లోని సూపర్ హీరోస్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఇటీవలే సూపర్ హీరోస్ గా పిలవబడే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ రంగంలోకి దిగేందుకు సిద్ధం అయింది. ప్రతి లక్ష మంది భారతీయులకు ఒకరు చొప్పున ఎంపిక చేయబడి నటువంటి వీళ్లు.. టాప్ ఫైట్ స్కిల్స్ ఉన్నటువంటి ఎలైట్ కమాండోలు. మౌంటెన్ వార్ ఫెర్ లో అలస్కా ఇండియాలో కఠిన శిక్షణ పొందినటువంటి వీరికి అమెరికన్ గ్రీన్ బ్యారెట్స్ వాడే అత్యాధునిక ఆయుధాలను అందించారు. కంటికి కనిపించనంత వేగంగా గెరిల్లా దాడులు చేయడంలో వీరు శిక్షణ తీసుకున్నారు. అయితే ఈ సూపర్ హీరోస్ ని ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లోకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి