విశాఖ ఉక్కు.. ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపైకి వచ్చిన మరో కొత్త అంశం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఏపీలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీన్ని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే జగన్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ప్రజా ఉద్యమంతో  వచ్చిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం విక్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందట. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఓ ప్రకటన చేశారు.



రాష్ట్ర విభజన హక్కు చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం ఒక స్టీల్ ప్లాంట్ కేటాయించాల్సి ఉందని.. ప్రైవేటీకరణతో ఎవరికో కట్టబెట్టడం బదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుతత్వానికే ఇవ్వమని కోరుతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అప్పులు కేంద్రమే భరించాలని.. అప్పులు, కేటాయింపులు లెక్కబెట్టి ఏపీకి ఇవ్వాల్సిందేనని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఉక్కు కర్మాగారంగా విశాఖ స్టీల్ ప్లాంటునే ఇవ్వొచ్చని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు.



ముఖ్యమంత్రికి కూడా పరిశ్రమల శాఖ తరపున ఈ ప్రతిపాదనను వివరిస్తామన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి .. పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావ్వాల్సిన స్టీల్ ప్లాంట్ సహా అనేక అంశాలపై  కేంద్రం ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఏమాత్రం సమంజసం కాదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంటున్నారు.



అయితే ఈ ప్రకటనపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది సీఎం జగన్ నిర్ణయమా.. లేక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటనా అన్నది స్పష్టత అవసరం. రాష్ట్రం నిర్ణయం అయితే.. ముఖ్యమంత్రికి కూడా పరిశ్రమల శాఖ తరపున ఈ ప్రతిపాదనను వివరిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎందుకు అంటారన్న వాదన వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే కొంటే అది సాహసోపేత నిర్ణయమే అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో..?



మరింత సమాచారం తెలుసుకోండి: