ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దూకుడుగా వెళుతున్నారు. అయితే కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం అనేది టాక్. ప్రధానంగా
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు అధికార పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. అధికార పార్టీలో బలమైన నేతలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న సరే ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న వాళ్ళు మాత్రం కరువవుతున్న పరిస్థితి.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార
వైసీపీ నేతలు చాలా మంది వివాదాస్పదంగా వ్యవహరించారు.
అధికారం రాకముందు ప్రజలలో ఎక్కువగా కనబడే నేతలు అధికారం వచ్చిన తర్వాత మాత్రం ప్రజల్లో కనపడటానికి ఆసక్తి చూపించలేదు. దీని కారణంగా
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార
పార్టీ చాలా ఇబ్బందులు పడుతున్నది. ప్రజలను ఓట్లు అడిగే నేతలు కూడా పెద్దగా ఎవరూ కనపడలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించలేదంటే మాత్రం అది ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు
ఉత్తరాంధ్ర నేతలు పెద్దగా ఎవరూ దీని మీద దృష్టి పెట్టడం లేదు.
బిజెపి కూడా ఎన్నికల మీద దృష్టిపెట్టిన సరే అధికార
వైసీపీ నేతలు మాత్రం
ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మీద ఆశలు పెట్టుకుని సైలెంట్ గా ఉంటున్నారు.
దీని కారణంగా
పార్టీ ఎక్కువగా నష్టపోతుందనే
భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మాట కూడా లెక్కచేయని చాలా మంది నేతలు ఇప్పుడు ఇలాగే వ్యవహరించడంతో
పార్టీ ఎక్కువగా నష్టపోతుంది అని చెప్పవచ్చు. ఇక
ముఖ్యమంత్రి జగన్ కూడా కొంతమంది విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించడం అధికార పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది అని చెప్పాలి. మరి భవిష్యత్తులో అయినా సరే
జగన్ వైఖరిలో మార్పు వస్తుందా
పార్టీ నేతల వైఖరిలో మార్పు వస్తుందా అనేది చూడాలి.