ప్రస్తుతం రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది..  టెక్నాలజీకి అనుగుణంగా మనిషి జీవన శైలి లో కూడా ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కరి జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు మంచి కంటే చెడు ఎక్కువగా దారితీస్తున్నాయి.  సరికొత్త అలవాట్లు ఆరోగ్యానికి చేటు చేసే విధంగా ఉన్నాయి. ఒకప్పుడు పగలు ఎంత కష్టపడినా రాత్రయితే చాలు సరైన సమయానికి పడుకోవటం ఉదయం  లేవడం చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు పడుకోవడానికి సరైన సమయం అంటూ లేకుండా పోయింది. కొంతమంది ఇష్టం వచ్చిన సమయంలో పడుకుంటూ ఉంటే మరి కొంతమంది అసలు నిద్రపోవడానికి సమయాన్నే  కేటాయించడం లేదు.



 ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రకు కేవలం కొంత సమయం మాత్రమే కేటాయిస్తూ ఉండడంతో ఇక ఎంతో మంది కొత్త కొత్త ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ప్రతి రోజూ ప్రతి ఒక్కరు కూడా 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి అని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలా నిద్ర పోయినప్పుడు మాత్రమే ఏకాగ్రతతో ప్రతి ఒక్కరు కూడా పని చేయడానికి అవకాశం ఉంటుందని లేదంటే ఏకాగ్రత కోల్పోవడమే  కాదు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది అని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరూ నిద్ర కోసం సరైన సమయాన్ని కేటాయించడం లేదు.



 ప్రస్తుతం ఇక బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలో  ప్రతి ఒక్కరికి సరైన నిద్ర దొరకడం లేదు అని చెప్పాలి. అయితే ప్రతి రోజూ వైద్యులు సూచించిన విధంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోకపోతే వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గిపోతుందని అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా సరైన నిద్ర లేకపోతే ఇక బరువు కూడా పెరుగుతారట. సరైన నిద్ర లేకపోతే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావడంతో పాటు డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉందట.  నిద్ర సరిగా లేకపోవడంతో సెక్స్  సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: