మృత్యువు ఎప్పుడు ఎటునుంచి దూసుకువచ్చి ప్రాణాలను హరించుకుపోతుందో  అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. జీవితం మొత్తం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో విధి చిన్నచూపు చూసి చివరికి మృత్యువు దరి  చేరుతూ ఉంటుంది. అనుకోని ఘటనలతో కుటుంబంలో విషాదం నిండి పోతూ ఉంటుంది.  కుటుంబం మొత్తం ఆనందంగా ఉన్న తరుణంలో ఇక ప్రియమైన వారు  దూరం కావడంతో అరణ్యరోదనగా కుటుంబం మొత్తం వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.



 ఆ రైతు చిన్న చితకా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  పశువుల కాపరిగా ప్రతి రోజు పశువులను తోలుకుని మేతకు తీసుకెళ్లాడు.  ఇక పశువులను మేతకు తీసుకెళ్లడం వాటి ద్వారా వచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషించడం చేసే వాడు ఆ రైతు. సాఫీగా సాగిపోతున్న అతని  జీవితాన్ని చూసి విధి  ఓర్వలేక పోయింది.. చివరికి మొసలి రూపంలో అతని దగ్గరికి మృత్యువును పంపించింది.  అయితే మొసలితో ఎంతగానో పోరాడిన ఆ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 నీళ్ళలోకి దిగి బర్రెలను కడుగుతూ ఉండగా పశువుల కాపరిపై ముసలి దాడి చేసింది. అయితే మొసలి దాడి నుంచి తప్పించుకునేందుకు సదరు వ్యక్తి ఎంత ప్రయత్నించినప్పటికీ ముసలి మాత్రం అతన్ని వదలలేదు. దీంతో చివరికి అతను ప్రాణాలు కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఈసోజీ పేట శివారులో ఉన్న మంజీరా నదిలో.. బర్రెలను కడుతుండగా అక్కడికి చేరుకున్న ముసలి ఇక రాములు అనే వ్యక్తిని పట్టుకుని నీళ్ళలోకి లాక్కెళ్ళింది.  అయితే అతను తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. గట్టున ఉన్న మిగతా పశువుల కాపర్లు నీళ్లలోకి దిగకుండా గట్టు  నుంచి రాళ్లతో కర్రలతో కొట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: