కరోనా మరోసారి దేశాన్ని కుదిపేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్‌ కంటే ఎక్కువ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఇంకా ప్రజల్లో పెద్దగా చలనం కనిపించడం లేదు. జనం ఇంకా కరోనాను లైట్ గా తీసుకుంటున్నారు. భయంకరమైన విషయం ఏంటంటే.. సెకండ్‌ వేవ్‌లో మరణాలు సంఖ్య పెరుగుతోంది. చాలా మంది సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. కరోనాను లైట్ గా తీసుకోవద్దంటున్నారు.


అయితే కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.. ఫస్ట్ వేవ్‌లో దేశంలో కేవలం లక్షల మంది చనిపోతే.. ప్రజలు నిర్లక్ష్యం ఇలాగే ఉండే సెకండ్‌ వేవ్‌లో మృతుల సంఖ్య కోట్లలోనే ఉంటుదని చెబుతున్నారు. ఇందుకు చరిత్రలోని సంగతులను కోట్ చేస్తున్నారు. గతంలో వందేళ్ల క్రితం స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ స్పానిష్ ఫ్లూ వ్యాపించింది. కోట్ల మందిని పొ‌ట్టన పెట్టుకుంది. అప్పుడు కూడా స్పానిష్ ఫ్లూ రెండో దశలోనే భారీగా ప్రజలను చంపేసింది.


గతంలో స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు తొలిదశలో కేవలం 30-50 లక్షల మంది మాత్రమే చనిపోయారు. అయితే.. కొంతకాలానికి స్పానిష్ ఫ్లూ తగ్గింది.. జనం అంతా సర్దుకుందన్న అపోహతో నిర్లక్ష్యం వహించారు. అంతే స్పానిష్ ఫ్లూ రెండోదశలో విజృంభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్ల మంది వరకూ చనిపోయారు. ఇప్పుడు కూడా కరోనాను ప్రజలు నిర్లక్ష్యం చేస్తే ముప్పు తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించడమే దీనికి విరుగుడుగా చెబుతున్నారు.


మరో కీలకమైన విషయం ఏంటంటే.. కరోనా వైరస్‌ నిరంతరం రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌లో  2.5 లక్షల మ్యుటేషన్స్‌ గుర్తించారు. అమెరికా, ఇంగ్లండ్‌, బ్రెజిల్‌ దేశాలపై  ఈ మ్యుటేషన్ల ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే జనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: