పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం. అంతే కాదు ఒక మధుర ఘట్టం అనే చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరూ పెళ్లి వయసు రాగానే తమకు ఒక తోడు  కావాలి అని కోరుకుంటూ ఉంటారు. పెద్దలు కూడా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది అని అంటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరూ కూడా సరైన వయసులో పెళ్లి చేసుకోవడం లేదు ముఖ్యంగా అబ్బాయిలు అయితే 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. లైఫ్ లో సెటిల్ అయ్యి బాగా సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తూ పెళ్లి పై అంతగా ఆసక్తి చూపడం లేదు చాలామంది.



 అదే అమ్మాయిల విషయానికొస్తే ఏదో కొంత మంది తప్ప మిగతా అందరూ కూడా దాదాపు తొందరగానే పెళ్లి చేసు కుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఆ ప్రాంతంలో ముప్పై ఏళ్ళు నిండుతున్నప్పటికీ అమ్మాయిలకు వివాహాలు మాత్రం కావడం లేదు అయితే ఇలా వివాహాలు కానీ వారు పదో పాతికో  ఉన్నారు అనుకుంటే మాత్రం పొరబాటే ఏకంగా 50 వేల మంది యువతులకు పెళ్లి వయసు వచ్చిన 30 ఏళ్ళు దాటిపోతున్నా ఇంకా వివాహాలు మాత్రం జరగడం లేదట ఇటీవలే ఓ ఎన్ జి ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది.



 సాధారణంగా అయితే మన దేశంలో దాదాపు 20 ఏళ్ల లోపు పెళ్లిళ్లు జరిగి పోతాయి. మహా అయితే 25 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్నారు. కానీ 30 ఏళ్ల వరకు మాత్రం ఎవరూ వేచి చూడటం లేదు. కానీ ఇక్కడ మాత్రం 30 ఏళ్ళు దాటిపోతున్న పెళ్లిళ్లు కాని స్త్రీలు వేల సంఖ్యలో ఉన్నారు అయితే ఇలా ఏకంగా 50 వేల మంది యువతులు 30 ఏళ్లు దాటి పోతున్నా పెళ్లి చేసుకోకుండా ఉండడం వెనుక కూడా పెద్ద కారణమే ఉంది. ఇలా పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండడానికి ఆర్థిక సమస్యలు కారణం అని అందరూ చెబుతున్నప్పటికీ కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కారణం కాదని..  ఒక తండ్రి ఒక మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తే మరొక వ్యక్తి అంతకన్నా మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నారని ఇలా పోటీలు పడుతూ ఉండటంతో ఎంతో మంది యువతులకు పెళ్లిళ్లు కావడం లేదు అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: