
అయితే ఇప్పుడు 10 గంటల తర్వాత కర్ఫ్యూ అనగానే కంగారుపడుతున్నారు. 10 లోపు చేయడానికి ఏపని దొరకదు. ఖాళీగా ఉంటే పూట గడవదు, ఇక్కడే ఉండటానికి డబ్బు లేదు అంటూ లెక్కలు వేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. మళ్ళీ పొట్ట చేతబట్టుకుని సొంత గ్రామాలకు తరలిపోవాల్సిందేనా అని చింతిస్తున్నారు. ఇటువంటి గట్టు సమయంలో కొందరు తమ సొంత ఊళ్లకు తిరుగు ప్రయాణం పట్టగా, మిగిలినవారు తెలంగాణ సర్కారు తమకు ఏ రకంగానైనా సాయం అందిస్తుందేమోనని ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. మా కష్టాలు గ్రహించి సాయం అందిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. అయితే గత ఏడాది వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో ఎంతగా కష్టాలను ఎదుర్కున్నారో మనకు తెలిసిన విషయమే.
ఇప్పుడు పూర్తి లాక్ డౌన్ కాకపోయినప్పటికీ 10 వరకు చేయడానికి, అంత తక్కువ సమయంలో ఏపనీ దొరకదు పూట గడవడం గగనం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈసారైనా వలస కార్మికుల విషయంలో వేగంగా స్పందించి వారికి సహాయసహకారాలు అందిస్తుందేమో చూడాలి. కేసీఆర్ ప్రభుత్వం ఈ సారైనా వలస కూలీల కోసం సరైన ప్రణాళిక చేస్తుందా లేదా చూడాలి.