ఇవాళ సోమవారం.. ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఏదో ఓ బిగ్ బ్రేకింగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు, సీబీఐ కోర్టు అన్ని చోట్లా కీలకమైన కేసుల్లో విచారణ జరుగుతోంది. వీటిలో ఏ ఒక్క కేసులో కీలకమైన తీర్పు వచ్చినా అది ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది. మరి ఆ కేసులు ఏంటో చూద్దామా.. వీటిలో మొదటిది జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్.


అదే సమయంలో ఇటు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులోనూ  జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ  ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగబోతోంది. ఇక్కడ ఇప్పటికే అటు జగన్, ఇటు సీబీఐతో పాటు అందరికీ నోటీసులు వెళ్లాయి. ఇప్పుడు ఆ వివరణల ఆధారంగా విచారణ జరగబోతోంది. ఇప్పటికే సీఎం జగన్ చాలా కాలంగా బెయిల్ పై ఉన్నారు. బెయిల్ పై ఉన్న వ్యక్తి బెయిల్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవి పాటించడం లేదని కోర్టు భావిస్తే.. ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.


ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ  ఎంపీ రఘురామకృష్ణంరాజు  అటు సుప్రీం కోర్టులోనూ.. ఇటు సీబీఐ కోర్టులోనూ పిటిషన్లు వేశారు. ఈ రెండు చోట్ల ఎక్కడైనా  జగన్ బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వస్తే అది ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది. మరి అలాంటి సంచలనం వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. మరోవైపు ఏపీ హైకోర్టులో ధూళిపాళ్ల బెయిల్ పిటీషన్ కూడా ఇవాళ విచారణకు రాబోతోంది.  


సంగం డెయిరీ అక్రమాల కేసులో ఈ డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికే అరెస్టయి జైళ్లో ఉన్నారు. ఈ కేసు విచారణ ఇప్పుడు హైకోర్టులో జరుగుతోంది. ఈ కేసులో ఏం తీర్పు వస్తుందోనన్న ఆసక్తి కూడా ప్రజల్లో నెలకొంది. ఏదేమైనా ఇవాళ కోర్టుల్లో అన్నీ కీలక కేసులే ఉన్నాయి. మరి ఎలాంటి సంచలన తీర్పులు వస్తాయో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: