నమ్ముకున్న వాళ్ల కోసం జగన్ ఏదైనా చేస్తాడు.. అనేది ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం.. ఇది తన తండ్రి వైఎస్‌ వ్యక్తిత్వం ద్వారా వారసత్వంగా తెచ్చుకున్న లక్షణం. అది మంచో.. చెడో అన్నది ఆలోచించకుండా.. మనలను నమ్ముకున్న వాళ్లను ఆదుకోవాలి.. మనపై ఆధారపడిన వాళ్లకు సాయం చేయాలన్నది వైఎస్ ఫ్యామిలీ పాలసీ. ఇలాంటి పాలసీ నాయకులపై రెండు రకాలుగా ప్రభావం చూపుతుంది. నమ్ముకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తాడ్రా అన్న మంచి పేరుతో పాటు.. నమ్ముకున్న వాళ్ల కోసం అడ్డగోలుగా వెళ్తాడన్న చెడ్డపేరూ వస్తుంది.

అయితే నమ్ముకున్నవాళ్ల కోసం చేసేయడమే కానీ.. దాని పర్యవసానాలు పెద్దగా ఆలోచించరు ఇలాంటి నాయకులు. ఇప్పుడు జగన్ అలాంటి మరో నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. తనతో పాటు సీబీఐ కేసుల్లో ఇబ్బంది పడిన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మిని ఆయన పట్టుబట్టి ఏపీకి రప్పించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను తెలంగాణకు కేటాయించారు. కానీ.. జగన్ ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమెను ఏపీకి రప్పించుకున్నారు.

ఏపీకి వచ్చాక ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. ఇప్పుడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి సూపర్ టైమ్ స్కెల్ పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సూపర్ టైమ్ స్కేల్‌లోని 17 స్థాయి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్. ఈ ఏడాది జనవరి 18 తేదీన ఆమెకు సూపర్ టైమ్ స్కెల్ 15 స్థాయి పదోన్నతి కల్పించింది ప్రభుత్వం.

ఆరు నెలలు తిరక్కుండానే రెండు అత్యున్నత స్థాయి పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సూపర్ టైమ్ స్కేలు 17 స్థాయి ప్రకారం నెలసరి వేతనాన్ని  2 లక్షల 25 వేలు గా ప్రభుత్వం నిర్దారించింది. అదీ జగన్ నైజం.. జగన్ స్టయిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: