బిర్యానీ పేరు వినగానే మనకు నోరు ఊరుతుంది. ఇక దాని వాసన రాగానే.... ఇంకే ముంది.. బిర్యానీ లాగించేయాలని మనకు అనిపిస్తుంది. ఇక మన హైదరాబాద్‌ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్‌ బిర్యానీకి మన దేశంలోనే కాదు... ఇతరు దేశాల్లోనూ మంచి పేరుంది. అయితే... ఈ బిర్యానీ రేటు ఒక్కసారిగా 5 పైసలకే అంటూ బోర్డు పెడితే... జనాలు ఊరుకుంటారా ? ఆ బిర్యానీ సెంటర్‌  దగ్గర... బిర్యానీ కోసం ఎగబడుతున్నారు. 

5 పైసలకు బిర్యానీ ఏంటని అనుకుంటున్నారా...? అవును ఇది నిజమే.. అసలు వివరాల్లోకి వెళితే....  తమిళ నాడు రాష్ట్రంలో ఈ బిర్యానీ సెంటర్‌ దర్శనమించింది. ఆ రాష్ట్రంలోని ముధురై నగరానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా ఓ బిర్యానీ సెంటర్‌ను ఓపెన్‌ చేశాడు. అయితే... కొత్తగా షాప్‌ పెట్టడంతో... కాస్త ప్రమోషన్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకే ముంది అదే సమయానికి ఆ వ్యాపారికి కొత్త ఐడియా వచ్చేసింది. 

ఎవరైతే... 5 పైసల నాణేన్ని తీసుకుని వస్తారో... వాళ్లకు బిర్యానీ ఫ్రీ అని ప్రకటించేశాడు ఆ బిర్యానీ సెంటర్‌ ఓనర్‌. దీంతో ఆ ప్రకటన చేయడంతో... జనాలు ఆ బిర్యానీ సెంటర్‌ దగ్గర క్యూ కట్టేశారు. దాదాపు 400 మందికి పైగా 5 పైసలతో బిర్యానీ సెంటర్‌ ముందు లైన్‌ కట్టేశారు. అయితే.... ఈ క్యూ కట్టిన వారేవరూ కూడా..... కరోనా మహమ్మారి నిబంధనలు గాలికి వదిలేశారు. అందులో ఒక్కరూ కూడా.... భౌతిక దూరం, మాస్క్‌లు లాంటివి ఎవరూ పాటించలేదు. దీంతో ఓ వ్యాపారి... బిర్యానీ సెంటర్‌ ను మూసివేశాడు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు... ఆ బిర్యానీ సెంటర్‌ దగ్గరకు చేరి.. ఆ గుంపును చెదరగొట్టారు. కరోనా నిబంధనలు లేకుండా భారీగా జనాలు పోగు కావడంపై సీరియస్‌ అయ్యారు పోలీసులు.   అయితే.... ఈ బిర్యానీ న్యూస్‌ దేశ వ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: