రోజురోజుకూ వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఫాలోయింగ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తక్కువ సమయంలోనే రాష్ట్రంలో క్రేజ్ తెచ్చుకున్న బైరెడ్డి...ఇప్పుడు కర్నూలు జిల్లా వైసీపీలో ఒక కీలక నాయకుడుగా మారిపోయారు. పైగా బైరెడ్డి అంటే వైసీపీ యువత బాగా అభిమానిస్తుంది. కొందరు సీనియర్లకు బైరెడ్డి అంటే పడటం లేదు గానీ, యువ నాయకత్వం మాత్రం బైరెడ్డిని బాగానే ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీలో చాలామంది క్రేజ్ ఉన్న నాయకులు ఉన్నారు...కానీ వేరే జిల్లాల్లో, వేరే నియోజకవర్గాల్లో ఉండే పార్టీ బ్యానర్లలో కూడా బైరెడ్డి బొమ్మ ఉంటుందంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంటే ఇంతలా బైరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. అయితే పార్టీ ఎదుగుదల కోసం కృషి చేస్తున్న బైరెడ్డికి సైతం సీఎం జగన్ ఎక్కడకక్కడ న్యాయం చేస్తూనే వస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న బైరెడ్డి...గత ఎన్నికల్లో అక్కడ వైసీపీ గెలుపుకు ఎంత కృషి చేశారో అందరికీ తెలిసిందే.

అక్కడ ఆర్థర్ భారీ మెజారిటీతో గెలవడానికి కష్టపడ్డారు. ఇలా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ బైరెడ్డికి, జగన్ సైతం న్యాయం చేశారు. ఇటీవలే రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ చైర్మన్‌ పదవి(శాప్‌)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు. అయితే ఈ పదవి వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఉంటుంది. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో బైరెడ్డికి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఇస్తే బాగుంటుందని కొందరు వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.

కానీ యువ నాయకుడుగా ఉన్న బైరెడ్డికి అప్పుడే ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు రావడం కష్టమని తెలుస్తోంది. పైగా కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగా లేవు. 14 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు రెండు పార్లమెంట్ సీట్లలో కూడా వైసీపీ ఎంపీలు ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ పార్లమెంట్ అభ్యర్ధులని మార్చే అవకాశం లేకపోలేదు. అయితే ఏదైనా జగన్ చేతిలోనే ఉంటుంది. జగన్ తలుచుకుంటే బైరెడ్డికి బంపర్ ఆఫర్ మాత్రం ఉంటుందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: