తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలం నుంచి హాట్ టాపిక్ గా మారిన అంశం ఒక్కటే. అదే హుజురాబాద్ ఉప ఎన్నిక. టిఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్ ఏకంగా బీజేపీలో చేరడం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి తీరుతాను అంటూ కేసీఆర్ కు సవాల్ విసరడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ను కూడా విడుదల కాలేదు. అప్పుడే కేసీఆర్ హుజురాబాద్ ప్రజలను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇక ప్రభుత్వం తమ చేతిలో ఉండడంతో ఇక భారీగా నిధులు కేటాయించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.



 ఈ క్రమంలో ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి భారీగా నిధులు కేటాయించింది  ప్రభుత్వం. అంతే కాకుండా అటు దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్దమై సంచలనం సృష్టించింది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు కెసిఆర్ కురిపిస్తున్న హామీలు  అటు ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తున్నాయ్.  కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇస్తున్న హామీలనే టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా  పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.



 ఇక ఇటీవలే మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేశారు రేవంత్. రాబోయే 20 ఏళ్ళు టిఆర్ఎస్ దే అధికారం అని కెసిఆర్ చెప్పినప్పుడే తన ఓటమిని అంగీకరించారు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారు అంటూ ఆరోపించారు. బలహీన వర్గాలను కెసిఆర్ మోసం చేస్తున్నారు అంటూ విమర్శించారు. అధికారపార్టీ లీడర్లు మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారని.. భవిష్యత్తులో వారు కూడా సీఎం కేసీఆర్ పక్కన కూర్చోవడానికి కూడా మరింత వణికిపోతారు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కెసిఆర్ ఒంటరి వాడు అయ్యాడు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: