ప్రపంచంలో పొడవైన రైలు మార్గం ఎక్కడ ఉందంటే... అది మాస్కోలో అని చెప్పొచ్చు. రైల్వే టన్నెల్ గురించి అడిగితే... స్విట్జర్లాండ్‌లో అని చెప్పొచ్చు. అతి పెద్ద రైల్వే ప్లాట్ ఫామ్ ఎక్కడా అంటే... వెంటనే కర్ణాటకలోని హుబ్లీ అని ఠక్కున చెప్పేస్తాం. మరి అతి పొడవైనా దారి ఏదీ అంటే మాత్రం... చెప్పలేం. ఎంత దూరం అంటే మాత్రం చెప్పడం కష్టమే. దానికే ఇప్పుడు గూగుల్ సమాధానం చెప్పేసింది. సాధారణంగా రెండు దేశాల మధ్య తప్పనిసరిగా సరిహద్దు ఉంటుంది. లేకపోతే ఏదైనా నదీ లేదా సముద్రం రెండు దేశాలను, ఖండాలను వేరు చేస్తుంది. అప్పుడు వాటి మధ్య తప్పనిసరిగా పడవ లేదా విమానయాన ప్రయాణం చేయాల్సిందే. అంతే తప్ప అతి పెద్ద కాలినడక దారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదనేది అందరి భావన. కానీ ఆ మార్గం ఉందని గూగుల్ వెల్లడించింది.

ప్రపంచంలోనే అతి పెద్ద నడక మార్గం పొడవు మొత్తం 23 వేల కిలోమీటర్లు. ఇది ఈ భూమ్మీదే కాలినడకన వెళ్లగలిగే పొడవైనా దగ్గరి దారిగా గూగుల్ గుర్తింపు ఇచ్చింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి రష్యాలోని మగడన్ నగరం వరకు ఈ మార్గం ఉంది. ఈ మార్గంలో ప్రయాణించేందుకు ఎలాంటి వాహనాలు అవసరం లేదు. పడవలు, విమానాల అవసరం ఏ మాత్రం లేదు. మధ్యలో నదులపై వంతెనలు కూడా ఉన్నాయి. అయితే ఈ మార్గంలో గంటకు 3 కిలోమీటర్ల చొప్పున రోజుకు 8 గంటలు నడిస్తే... దాదాపు మూడు సంవత్సరాలు పడుతుంది ఈ దూరం నడిచేందుకు. మొత్తం 20 దేశా మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. మొత్తం 16 దేశాల మీదుగా ఈ ప్రయాణం సాగుతోంది. అందులో సౌత్ సుడాన్, సిరియా, జార్జియా లాంటీ ప్రమాదకర దేశాలు కూడా ఉన్నాయి. ఆయా దేశాల్లో పరిస్థితుల ప్రకారం ప్రయాణం అంత సురక్షితం కాదని కూడా గూగుల్ తెలిపింది. మొత్తం 4 వేల 4 వందల 92 గంటల పాటు ఈ ప్రయాణం సాగనుంది. గూగుల్ లెక్క ప్రకారం ఈ నడక మొత్తం 562 రోజులు పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: