సహజంగా మంత్రి అంటే ఒక రాష్ట్రానికి కింగ్ లా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రిగా ఉన్న నేతలు అన్ని పనులు చేయక పోయినా కనీసం తన శాఖలకు సంబంధించిన పనులతో పాటు తమ సొంత నియోజకవర్గాల్లో పనులు చేస్తూ ఉంటారు. అయితే ఏపీ మంత్రుల పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. వారు చెప్పుకునేందుకు మాత్రమే మంత్రులు తప్ప... వారి గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు కనపడటం లేదు. ఒకరిద్దరు మినహా మిగిలిన అందరికీ తమ శాఖల్లో కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మంత్రుల శాఖల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది.

ఇక ఇప్పుడు మంత్రులు కనీసం తమ సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కూడా చేసుకోలే ని పరిస్థి తి ఉంది. చాలా మంది మంత్రుల నియోజకవర్గాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పారిశుధ్యం , డ్రైనేజీ వ్యవస్థ కూడా ఘోరంగా ఉంది. ప్రజలు బయటికి వస్తే అధ్వానంగా ఉన్న రహదారులపై ప్రయాణిస్తే ఎప్పుడు ? ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. అయినా కూడా మంత్రులు పట్టించుకోవడం లేదు. చివరకు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని మంత్రులు ప్రజల వద్దకు కూడా వెళ్లడం లేదట.

చివరకు మంత్రులకు సన్నిహితంగా ఉన్న వారు మంత్రులను ప్రశ్నిస్తే మా బాధ ఎవరికి చెప్పుకోం... గోడకు చెప్పమంటారా ? అని క‌సురుకుంటున్నారట. తాము పేరుకు మాత్రమే మంత్రులని... తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారట. ఏదేమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు .. ఎమ్మెల్యేల‌కే కాదు చివరకు తన కేబినెట్లో మంత్రులను కూడా పట్టించుకోవడం లేదు అన్నది మాత్రం వాస్తవం. మంత్రులు కూడా తమ బాధ కక్కలేక మింగలేక అన్న చందంగా ఉంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: