ఒక్క వార్త.. ఒకే ఒక్క వార్త.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురి చేసింది. ఇలా జ‌రిగిందేంటి? అని ఒక్క‌సారిగా పార్టీ అధినేత చంద్ర‌బాబు నుంచి దిగువ స్థాయి నాయ‌కుల వ‌ర‌కు ఆశ్చ‌ర్యం , విస్మ‌యం కూడా వ్య‌క్తం చేశారు. అదే.. సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి చ‌ర్చ‌ల‌కు రావ‌డం.. దీనిపై జాతీయ‌స్థాయి లో ఆస‌క్తిక‌ర వార్త‌లువెలుగు చూడ‌డ‌మే! వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. చిరుకు రాజ్య‌స‌భ సీటును ఆఫ‌ర్ చేశార‌ని.. అందుకే చిరువ చ్చార‌ని.. జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్య‌లో టీడీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇదే నిజ‌మైతే.. పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంచ‌నాలు వేసుకున్నారు.

ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల్సి ఉంది. అసెంబ్లీలో పార్టీ అదినేత చంద్ర బాబు చేసిన భీష‌ణ ప్ర‌తిజ్ఞ నేప‌థ్యంలో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే కొన్ని నెల‌లుగా దూరంగా ఉన్న జ‌న‌సేన వంటి పార్టీని కూడా మ‌చ్చిక చేసుకుని ముందుకు సాగాల‌ని లోపాయికారీగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. త‌ద్వారా.. కాపు సామాజిక వ‌ర్గం త‌మ‌కు అండ‌గా నిలుస్తుంద‌ని.. అదేస‌మ‌యంలో యువ‌త కూడా పార్టీకి ఓట్లు వేస్తార‌ని.. టీడీపీఅ ధినేత నుంచి కింది స్థాయి నేతల వ‌ర‌కు లెక్క‌లు వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు చిరు.. వైసీపీలోకి చేరుతున్నార‌నే వార్త‌లు రావ‌డంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఒక‌వేళ చిరంజీవి.. వైసీపీలోకి చేరితే.. తాము జ‌న‌సేన‌లో చేరినా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. పైగా జ‌న‌సేన వీక్ అయ్యే అవ‌కాశం ఉంటుందని కొంద‌రు టీడీపీ నాయ‌కులు అంచనా వేశారు. కాపు సామాజిక వ‌ర్గం ఇప్పుడు ప‌వ‌న్ వైపు ఉంద‌ని భావిస్తే.. రేపు చిరంజీవి.. వైసీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగితే.. అప్పుడు ఎటు నిల‌బ‌డ‌తారు?  రేపు రాజ్య‌స‌భ సీటును తీసుకుంటే.. చిరంజీవి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. పోనీ.. ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. త‌న అభిమానుల‌కు ఏదో ఒక రూపంలో వైసీపీకి ఓట్లు వేయ‌మ‌ని సందేశం పంపించే ఛాన్స్ అయినా.. త‌ప్పదు!

ఈ నేప‌థ్యంలో కాపు సామాజిక వ‌ర్గం స‌హా.. యువ‌త ఖ‌చ్చితంగా వైసీపీవైపు మొగ్గు చూపితే.. త‌మ ప‌రిస్థితి మ‌రోసారి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అవుతుంద‌ని అంచ‌నా వేసుకుంటున్నారు. అయితే..చిరు తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించ‌డంతో టీడీపీలో ఒకింత సంతోషం వ్య‌క్తమైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: