అమరావతి : టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం లో ఎన్టీఆర్ వర్దంతి కార్య క్రమం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు, తది తరులు. అయితే ఈ సందర్భంగా
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.   సీనియర్ ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి పోయారని కొనియాడారు అచ్చెన్నాయుడు. ఎన్టీఆర్, టీడీపీ హయాం లోనే దేశంలో సంక్షేమమనే పదం పుట్టిందన్నారు అచ్చెన్నాయుడు. రూ. 35 పెన్షన్ పథకాన్ని ఆనాడు ఎన్టీఆరే ప్రారంభించారని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జగన్ అనే వైరస్ పట్టిందని..  జగన్ వైరస్ అతి పెద్ద వైరస్ అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అచ్చెన్నాయుడు.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువత బయటకి వచ్చి జగన్ వైరస్సును తరిమికొట్టాలి.. అప్పుడే ఎన్టీఆరుకు ఘన నివాళి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు, నారా లోకేషు కు కరోనా వచ్చింది అని టీడీపీ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందొద్దని భరోసా కల్పించారు అచ్చెన్నాయుడు.. చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారన్నారు అచ్చెన్నాయుడు. త్వరలోనే ఇద్దరు కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని స్పష్టం ఛేసారు అచ్చెన్నాయుడు.  అనంతరం  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్థన్ మాట్లాడుతూ..  ప్రజలు నాయకుల వద్దకు పోయే ఒరవడి నుంచి నాయకులు ప్రజల వద్దకు వెళ్లే విధానానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.  పేదోడికి అన్నం పెట్టి, పక్కా ఇంట్లో నివశించాలనే సరికొత్త ఆలోచనలకు ఎన్టీఆర్ నాంది పలికారని.. మహిళలకు ఆస్తిహక్కు కల్పించటంతో పాటు యువతను, విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు అని పేర్కొన్నారు.  ఎన్టీఆర్ ముందు రాజకీయాలు, తర్వాత రాజకీయాలు ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: