నరేంద్రమోడీ చేసే పనులలో చాలావరకు షోపుట్టప్పే ఉంటుంది. బహిరంగసభల్లో ప్రసంగాలు కూడా నాటకీయంగానే ఉంటాయి. అంతర్జాతీయస్ధాయిలో పాల్గొనే సమావేశాల్లో అయితే షో గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వేసుకునే డ్రస్సులు, మాట్లాడేటపుడు హావభావాలు, స్టైల్ అంతా ఒక పద్దతిప్రకారమే జరుగుతుంది. హోలు మొత్తంమీద ప్రచారం కోసమే మోడీ ఎక్కువగా పాకులాడుతారనే విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఇపుడిదంతా ఎందుకంటే సోమవారం ఢిల్లీలో జీ20 సదస్సు నిర్వహణపై అఖిలపక్ష సమావేశం జరగబోతుందడటమే.


ఆ అఖిలపక్ష సమావేశానికి మోడీనే అధ్యక్షత వహించబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మామూలుగా అయితే ప్రతిపక్షాలతో సమావేశమవటం మోడీకి ఏమాత్రం ఇష్టముండదు. ఈ విషయం పార్లమెంటు సమావేశాల్లో చాలాసార్లు రుజువైంది. పార్లమెంటు సమావేశాలకు మోడీ హాజరయ్యేది తక్కువ. ఒకవేళ హాజరైనా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమేచెప్పరు.  ఏ అంశంమీద ఎంత గోలచేసినా మోడీ పార్లమెంటులో సమాధానాలు చెప్పింది తక్కువే.

విచిత్రం ఏమిటంటే పార్లమెంటులో చెప్పాల్సిన సమాధానాలను బయట పార్టీ సమావేశాల్లోనో లేకపోతే బహిరంగసభల్లోనో చెప్పటం. ప్రతిపక్షాలంటే ఏమాత్రం గౌరవంలేని మోడీ ఇపుడు జీ20 సదస్సుపేరుతో అఖిలపక్ష సమావేశం పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఈ సదస్సు నిర్వహణకు ప్రతిపక్షాలు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమీ ఉండవు. ఇదే  సమయంలో మోడీ తీసుకునేవీ ఏమీవుండవు. అయినా ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారో అర్ధంకావటంలేదు.


తన హయాంలోనే జీ20 దేశాలకు అధ్యక్షత వహించే అవకాశం దేశానికి దక్కిందని షోపుట్టప్ చేయటానికి మాత్రమే ఈ సదసు పనికొస్తుంది. ఇది మొక్కుబడి సమావేశం అని చెప్పటానికి ఉదాహరణ ఏమిటంటే సమావేశం కేవలం 2 గంటలు మాత్రమే జరుగుతుండటం. దేశంలోని  రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలందరినీ పిలిచిన ఈ సమావేశం కేవలం 2 గంటలు మాత్రమే నిర్వహిస్తున్నారంటే అర్ధమేంటి ? ఈ 2 గంటల్లో ఎవరేమి మాట్లాడగలరు ? ఏమి సూచనలు సలహాలివ్వగలరు ? ఈ కారణంతోనే సమావేశం షోపుట్టప్పని అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: