
ఈ విషయమే తమ్ముళ్ళకు అర్ధంకావటంలేదు. గడచిన 17 రోజులుగా ఢిల్లీలో కూర్చుని నారా లోకేష్ ఏమిచేస్తున్నారు అన్నది ఎవరికీ అర్ధంకావటంలేదు. స్కిల్ స్కామ్ లో రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ మీద కేసుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను సీఐడీ ఏ 14గా కేసు నమోదుచేసింది. వెంటన అరెస్టు కాకుండా ముందస్తుబెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ పిటీషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు ఇదే సమయంలో లోకేష్ ను 4వ తేదీవరకు అరెస్టు చేయద్దని చెప్పింది.
ఇదే సమయంలో సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్ ను కూడా ఆదేశించింది. ఇదంతా జరిగి మూడురోజులు అయిపోయింది. సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్ళి నోటీసులు కూడా సర్వ్ చేశారు. అంతకుముందైతే అరెస్టుకు భయపడే లోకేష్ ఢిల్లీలో దాక్కున్నాడనే ప్రచారం జరిగింది. హైకోర్టు 4వ తేదీవరకు అరెస్టు చేయద్దని చెప్పిన తర్వాత కూడా లోకేష్ ఎందుకు ఇంకా ఢిల్లీలోనే కూర్చున్నట్లు ? చంద్రబాబుకు బెయిల్, కేసులను కొట్టేయాలని క్వాష్ పిటీషన్ 4వ తేదీ సుప్రింకోర్టులో విచారణకు రాబోతోంది.
అలాగే లోకేష్ వేసిన కేసు కూడా 3వ తేదీన హైకోర్టులో విచారణకు రాబోతోంది. ఎలాగూ 4వ తేదీన సీఐడీ విచారణకు రావాల్సిందే తప్ప వేరే దారిలేదు. చంద్రబాబు తరపున వాదిస్తున్న లాయర్లు సిద్ధార్ధలూథ్రా, హరీష్ సాల్వే, సిద్ధార్ధ అగర్వాల్ ను కలిసి లోకేష్ చేయగలిగేది కూడా ఏమీలేదు.
ఢిల్లీలోనే గంటకొట్టారు, ఢిల్లీలోనే నిరసన దీక్ష కూడా చేశారు. హాయిగా రాజమండ్రికి వచ్చేసి తల్లితో పాటు ఉండకుండా ఇంకా ఢిల్లీలోనే ఎందుకు ఉండిపోయాడు ? అక్కడ ఏమిచేస్తున్నాడు అన్నదే అర్ధంకావటంలేదు. బీజేపీ పెద్దల అపాయిట్మెంట్ దొరికే అవకాశాలు లేవని దాదాపు లేవని తేలిపోయింది. తల్లి, భార్యను కూడా వదిలేసి రాజమండ్రికి దూరంగా ఢిల్లీలో ఏమిచేస్తున్నాడన్నదే పెద్ద పజిల్ అయిపోయింది. మొత్తంమీద హైకోర్టు ఆదేశాలిచ్చినా ఇంకా లోకేష్ లో అరెస్టు భయం పోలేదనే సెటైర్లు పెరిగిపోతున్నాయి.