తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు అధికారాన్ని చేపట్టింది బిఆర్ఎస్ పార్టీ. అయితే బిఆర్ఎస్ పాలను కొనసాగినన్ని రోజులు కూడా బీసీలను చిన్న చూపే చూసింది అనే ఒక ప్రచారం ఉంది. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని ఇక బీసీ నాయకులకు ఎన్నికల సమయంలో సరైన అవకాశాలు ఇవ్వలేదు అంటూ ఇక ఎన్నో విమర్శలు కూడా తెరమీదకి వచ్చాయి. అయితే మిగతా వారితో పోల్చి చూస్తే బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. కానీ బీసీలకు తగినన్ని సీట్లు దక్కలేదని.  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా విమర్శలు వచ్చాయి. ఇక ఇలాంటి విమర్శలు ఒక రకంగా బిఆర్ఎస్  ఓటమికి కూడా కారణమయ్యాయి అని చెప్పాలి.


 ఇలా అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా బీసీలకు పెద్దగా అవకాశాలు ఇవ్వని గులాబీ దళపతి కేసీఆర్.. ఇక ఇప్పుడు మాత్రం ఓడిపోయాక.. బీసీ నినాదాన్ని పట్టుకున్నాడు.  ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఏకంగా ఆరుగురు బీసీలకు సీట్లు ఇచ్చాడు. దీంతో అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ బీసీలకే పెద్ద పీట వేసారంటూ ఆ పార్టీ నేతలు అందరూ కూడా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ అదే పార్టీలోని బీసీ నాయకులు మాత్రం కేసీఆర్ తీరుపై మండిపడుతున్నారు. పార్టీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు బీసీలను.. పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఓటమి తప్పదు.. పెద్దగా పట్టులేదు అనుకున్నప్పుడు మాత్రం బీసీలకు సీట్లు ఇచ్చి బలి పశువులను చేసేస్తున్నారు అంటూ కొంతమంది బిఆర్ఎస్ బీసీ నేతలు అసంతృప్తితో ఉన్నారట.


 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది బిఆర్ఎస్. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఆ సమయంలో బీసీలకు కేవలం 4సీట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో ఒకటి విజయానికి ఎక్కడ అవకాశం లేని ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ సీట్ కావడం గమనార్హం. ఇకఇప్పుడు కూడా బిఆర్ఎస్కు కాస్త కోస్తా గెలుపు అవకాశాలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓసీలకు టికెట్లు ఇచ్చిన కేసీఆర్.. బీసీలకు మాత్రం పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉన్నచోటే సీట్లు ఇచ్చారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. మెదక్ లో గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉండగా.. అక్కడ మంచి పట్టు ఉన్న నేత గాలి అనిల్ కుమార్ ను కాదని వెంకటరామిరెడ్డికి సీటు ఇచ్చారు. గాలి అనిల్ కుమార్ కు జహీరాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఇక హైదరాబాద్ స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ను నిలబెట్టారు. అక్కడ ఎంఐఎం కంచుకోటలో ఇతర పార్టీ నేతలు గెలిచే ఛాన్స్ లేదు. ఇలా బీసీలను నిలబెట్టిన ప్రతిచోట.. ఛాన్స్ ఇచ్చారు అనే మాట తప్ప.. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నది బిఆర్ఎస్ లోని బీసీ నాయకుల భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: