ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగార మ్రోగింది.. దీనితో అటు అధికార పార్టీ,ఇటు ప్రతిపక్ష పార్టీలు అలెర్ట్ అయ్యాయి.. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కూడా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో ఇరు పార్టీ వర్గాలు తమ ప్రచార వ్యూహనికి పదునుపెడుతున్నారు.. ఇప్పటికే ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరిట ప్రచారం మొదలు పెట్టారు. తన పదునైన మాటలతో అధికార పార్టీ ని ఎండగడుతూ ప్రజలను మమేకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు సిద్ధం సభలతో హోరేత్తించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు  మొదటి విడత జరుగుతాయని భావించారు. ఊహించని విధంగా ఎన్నికల ప్రచారానికి సమయం దొరికింది. దీనితో సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఆయన బస్సు యాత్ర ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇదెంత తప్పుడు వ్యూహమో.. వైసీపీ  వ్యూహకర్తలకు మొదటి రోజే అనుభవంలోకి వచ్చినట్లు తెలుస్తుంది.

జగన్ బస్సు యాత్రకు ఎక్కడా కూడా అంతగా కవరేజీ రాలేదు. చివరికి జగన్ అడుగు బయటకు వేస్తే ఓ రేంజ్  పబ్లిసిటీ చేసే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలు సైతం జగన్ బస్సు యాత్రను అంతగా కవర్ చేయలేదు.కొన్ని మాధ్యమాలు కవర్ చేసిన కూడా ఈ బస్సు యాత్రలో జనాల్లేని దృశ్యాలు బాగా వైరల్ అయ్యాయి. వెంపల్లెలోనే జగన్ పది నిమిషాల్లో వస్తున్నారని తెలిసినా కూడా పట్టుమని ఇరవై మంది కూడా రాలేదు.. ఇక ఇడుపులపాయ నుంచి బయలుదేరి ప్రొద్దుటూరుకు వచ్చే వరకూ మూడు నియోజకవర్గాలు కవర్ చేసినా జన ప్రవాహం వున్నా దృశ్యాలు కనిపించలేదు. ఎక్కడ చూసినా ఖాళీగానే కనిపిస్తోంది. అయితే ఎండాకాలంలో బస్సు యాత్ర పెట్టడం.. అలాగే పార్టీ క్యాడర్ ను పక్కన పెట్టి పూర్తిగా వాలంటీర్ల మీద రాజకీయం చేస్తున్న సమయంలో ప్రజలు ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటారని ఆశించడం కూడా తప్పేనని వైసీపీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: