దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దేశమంతా ప్రస్తుతం ఎన్నికల మోడ్ లోకి వెళ్ళిపోయింది.. ఇప్పుడు దేశావ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలపై చర్చ జరుగుతుంది.అయితే ఇదే క్రమంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.అలాగే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో అక్కడి ప్రధాన పార్టీలు లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువరించడంతో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రచార కార్యక్రమాలతో అన్ని పార్టీలు హోరెత్తిస్తున్నాయి.. ఈ సమయంలో లోక్ సభ ఎన్నికలపై ప్రముఖ మీడియా సంస్థ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికరమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మార్చి 13 నుంచి 27 వరకూ ప్రముఖ మీడియా సంస్థ ఆన్ లైన్ సర్వే ను నిర్వహించింది. ఈ సర్వేలో తాజా పరిస్థితులపై ప్రజలతో చర్చించడం జరిగింది. 

ప్రస్తుత రాజకీయ  అంశాల పై సూటిగా ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఆన్ లైన్ సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాలలో మోదీ హవా కొనసాగుతుండని తేలింది.విపక్ష ఇండియా కూటమి ప్రధాని మోడీ హవాను తట్టుకుని నిలబడలేదని ఏకంగా 73.80 శాతం మంది తెలుగువాళ్లు అభిప్రాయపడినట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాలలో ఇండియా కూటమికి మద్దతుగా 17.34 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక 8.86 శాతం మంది ఏమీ చెప్పలేమని  తెలిపినట్లు సమాచారం.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం చాలా ముందుందని ఈ సర్వేలో తేలినట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని 60.62 శాతం మంది తెలపగా.. 26.20 శాతం మంది నెరవేర్చలేదని.. 12.18 శాతం మంది ఏమీ చెప్పలేమని తెలిపినట్లు సమాచారం. దీనితో ఈ సారి కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మోదీ హవా కొనసాగనున్నట్లు అన్ని సర్వేలు చెబుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: